NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లులో పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్ చేతుల మీదుగా శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందన్నారు. లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు.