ATP: తాడిపత్రిలో అదృశ్యమైన గౌతమ్ అనే 7 ఏళ్ళు బాలుడిని రూరల్ పోలీసులు ఇవాళ క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. బాలుడు కనిపించలేదన్న ఫిర్యాదుతో రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి, ఎస్సై ధరణి బాబు బృందం వెంటనే దర్యాప్తు చేపట్టి ఆచూకీ కనుగొన్నారు. బాలుడిని సురక్షితంగా అప్పగించడంతో తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.