ATP: శింగనమల నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే బండారు శ్రావణి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. జాతీయ రహదారి NH-544D పనుల్లో భాగంగా శింగనమల క్రాస్ వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేయాలని, దీనివల్ల వాహనదారులకు, రైతులకు రక్షణ ఉంటుందని కోరారు. దీంతో సమస్యలను పరిష్కరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.