VZM: గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం వల్ల ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుందని, గ్రామ ఐక్యతకు ఇవి దోహదపడతాయని ఏపీ మార్క్ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు అన్నారు. కొల్లిపేట గ్రామంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి రూ.20వేలు విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు శుక్రవారం అందజేశారు. ఆలయ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.