W.G: తాడేపల్లిగూడెం పట్టణంలో అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మున్సిపల్ అధికారులు తొలగించారు. వాటిపై అపరాధ రుసుము కూడా సంబంధిత వ్యక్తులపై వేశారు. వన్ టౌన్లో 65, టూటౌన్లో 80 ఫ్లెక్సీలు తొలగించినట్లు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. ఇకపై ఏ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా తమ అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు.