MBNR: మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నం నడుస్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలును రాయచూరు వరకు పొడిగించాలని ఎంపీ డీకే అరుణ గురువారం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వినతిపత్రం అందజేశారు. ఎక్స్‌ప్రెస్ రైలు రాయచూరు వరకు పొడిగిస్తే దేవరకద్ర, మరికల్, మక్తల్, ప్రయాణికులకు సౌకర్యం కలుగుతుందని తెలిపారు. పొడిగింపుకు అవకాశాలను పరిశీలిస్తామన్నామని మంత్రి అన్నారు.