NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ పూర్ణాహుతి చండీహోమాన్ని నిర్వహించారు. ఈ చండీ హోమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి పాల్గొన్నారు. అనంతరం బీసీ ఇందిరారెడ్డి చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.