సత్యసాయి: ధర్మవరంలో అంగన్వాడీలకు ఇవాళ 5జీ మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పాల్గొని 230 మంది కార్యకర్తలు, 8 మంది సూపర్వైజర్లకు వీటిని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఈ ఫోన్లను అందజేస్తోందన్నారు.