నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సకాలంలో జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు దీక్ష చేపట్టారు. గురువారం దీక్ష చేస్తున్న కార్మికులను, నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అరెస్టు అయిన వారిలో మహిళలు కూడా ఉన్నారు.