స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మరో కొత్త అవతారంలో దర్శనమివ్వనున్నాడు. నందమూరి బాలకృష్ణ చేసే అన్‌స్టాపబుల్ షో తరహాలో మరో అదిరిపోయే షోతో సిద్ధూ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనతో ఓ ప్రముఖ OTT సంస్థ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. 2026 సంక్రాంతి కానుకగా ఈ షో ప్రారంభం కానుందట. సిద్ధూ హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ షో తెలంగాణ యాస ఒట్టి పడేలా ఉండనున్నట్లు టాక్.