BPT: వేమూరు నియోజకవర్గ పరిధిలో పంచాయితీ రాజ్ శాఖకు సంబంధించిన అభివృద్ధి పనుల ప్రగతిపై వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు గుంటూరు క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని మండలాల్లో కొనసాగుతున్న పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. మంజూరైన పనులు ఆలస్యం కాకుండా వెంటనే ప్రారంభించాలని సూచించారు.