NDL: ఖేలో ఇండియా బీచ్ గేమ్స్-2025లో ఏపీ తరఫున పాల్గొనే క్రీడాకారుల ఎంపికలు ఇవాళ విజయవాడలో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాధికారి రాజు తెలిపారు. మణిపాల్ ఆసుపత్రి సమీప కృష్ణా నది తీరంలో ఇవి ప్రారంభమవుతాయన్నారు. సెపక్ తక్రా, వాలీబాల్, కబడ్డీ విభాగాల్లో పురుషులు, మహిళలు పాల్గొనవచ్చు. ఆసక్తిగల జిల్లా క్రీడాకారులు హాజరుకావాలన్నారు.