VSP: బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహోత్సవాల్లో అఖరి రోజు కావడంతో శుక్రవారం ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహిళలు అమ్మవారికి పెద్ద ఎత్తున సారె సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈవో శోభారాణి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయావరణంలో ప్రత్యేక ప్రసాదం కౌంటర్లను అందుబాటులో ఉంచారు.