VSP: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో నిర్వహించిన 47వ అఖిల భారత పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్–2025లో ‘భారతరత్న శ్రీ అటల్ బీహారీ వాజపేయి జాతీయ అవార్డు’ను ఏపీఈపీడీసీఎల్ సాధించింది. 23 వేల గిరిజన కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందించిన సేవలకు ఈ గుర్తింపు లభించిందని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు.