TPT: ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చిలో జరగనున్న విషయం తెలిసిందే. పరీక్షల నూతన సంస్కరణలపై అవగాహన సదస్సు నేటి ఉదయం 10 గంటలకు తిరుచానూరులోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో జరుగుతుందని ప్రాంతీయ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్, పరీక్ష సెంటర్ల ప్రిన్సిపల్స్ హాజరు కావాలన్నారు.