ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో క్రేజీ మల్టీస్టారర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే లోకేష్.. బన్నీ, తారక్లను సంప్రదించినట్లు, వారు ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.