ఐపీఎల్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) వ్యూహంపై రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లు విహాన్, కౌశిక్‌తో పాటు ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను కొనుగోలు చేయడం అద్భుతమైన నిర్ణయమని అభినందించారు. ఈ వేలంలో ఆర్సీబీ స్మార్ట్‌గా వ్యవహరించి బాగా లబ్ధి పొందిందని, జట్టు బలంగా మారిందని విశ్లేషించారు.