TG: హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఇవాళ సీపీఎస్సీ వార్షిక సదస్సు జరగనుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగే సదస్సును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించనున్నారు. ఉదయం 10:30కు రాష్ట్రపతి రానున్నారు. సాయంత్రం 4:30 గంటల వరకు అక్కడే గడపనున్నారు. సదస్సు అనంతరం రామోజీ ఫిల్మ్‌సిటీలో పలు ప్రాంతాలను సందర్శించనున్నారు.