బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో నటి కృతి సనన్ జత కట్టనున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో ‘కిక్ 2’ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కృతిని కథానాయికగా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ మేరకు ఆమెతో వారు చర్చలు జరుపుతున్నట్లు, అన్నీ అనుకున్నట్లు జరిగితే బాలీవుడ్లో మరో కొత్త జంట తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు తెలిపాయి.