మేకప్ ఎక్కువసేపు మంచిగా నిలవాలంటే కొన్ని సరైన జాగ్రత్తలు పాటించడం అవసరం. మేకప్ వేసే ముందు మాయిశ్చరైజర్, ప్రైమర్ ఉపయోగిస్తే చర్మం మృదువుగా ఉంటుంది. మేకప్ వేసుకునే ముందు ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడుక్కోవాలి. లేదంటే ముఖంపై ఐస్ మసాజ్ చేస్తే.. మేకప్ వేసుకున్న తర్వాత బాగుంటుంది. అంతేకాదు రాత్రి మేకప్ తీసేసి పడుకోవాలి. లేదంటే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.