WGL: యాసంగి సీజన్లో సాగు పనులు ముమ్మరమవుతున్న వేళ ప్రభుత్వం ఎరువుల కొరత లేకుండా జాగ్రత్తలు చేపట్టింది. గతంలో సహకార సంఘాలకు పరిమితమైన యూరియా సరఫరాను ఈసారి ప్రైవేటు దుకాణాలకు విస్తరించారు. రాయపర్తి కేంద్రంలోని ప్రైవేటు వ్యాపారుల దుకాణాలకు యూరియా లోడులతో లారీలు చేరుకుంటున్నాయి. ఈ నిర్ణయంతో యూరియా కష్టాలు తప్పుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.