E.G: కొవ్వూరు డివిజన్ ఉప విద్యాశాఖాధికారి బీ. దిలీప్ కుమార్ శుక్రవారం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. కొవ్వూరు క్యాంప్ కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు. డివిజన్ పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులకు అమలవుతున్న 100 రోజుల ప్రణాళికపై ఎమ్మెల్యే చర్చించారు. ఉత్తీర్ణత శాతం పెంచేదిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.