సత్యసాయి: లేపాక్షిలో ఇవాళ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మహిళలు, బాలికల భద్రతపై ‘శక్తి’ యాప్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులకు యాప్ ఉపయోగాలు వివరిస్తూ, ఆపద సమయంలో SOS, డయల్ 112 ద్వారా వెంటనే పోలీసు సహాయం లభిస్తుందని తెలిపారు. అత్యవసర నంబర్లు 100, 1091, 181, 1930 వినియోగించాలని సూచించారు.