NZB: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి చట్టం ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు తీవ్ర అన్యాయం చేస్తుందని NZB ఆర్డీవోకు CPI(ఎం)నగర కమిటీ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా CPI(ఎం) నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. కేంద్రంలోని BJP అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అనేకు దఫాలుగా సవరించి పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలకు అనేక తూట్లు పొడిచిందని ఆరోపించారు.