వనపర్తి కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ దాడులు నిర్వహించారు. రూ. 10 వేల లంచం తీసుకుంటూ జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్ రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డాడు. యురియా సరఫరా నిమిత్తం ఒక ఫర్టిలైజర్ దుకాణం వ్యాపారి దగ్గర నుంచి రూ.20 వేలు డిమాండ్ చేయగా రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.