GNTR: అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని MLA నసీర్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో 139 మంది అంగన్వాడీ కార్యకర్తలకు 5జీ మొబైల్ ఫోన్లను ఆయన పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేంద్రాల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆధునిక సాంకేతికత సేవలలో పారదర్శకత పెరుగుతుందన్నారు.