WNP: జిల్లాలో దాగి ఉన్న పర్యటక అందాలను ఫోటోలు, వీడియోల రూపంలో పరిచయం చేసిన వారికి పర్యటక శాఖ ఆధ్వర్యంలో భారీ నగదు బహుమతులు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో 100 వీకెండ్ వండర్స్ పోస్టర్ ఆవిష్కరించారు. కన్సోలేషన్ బహుమతులుగా హరిత హోటల్స్‌లో ఉచిత బస కల్పిస్తారని వెల్లడించారు.