SRPT: కోదాడ పబ్లిక్ క్లబ్ అభివృద్ధిలో అక్కిరాజు వెంకట్రావు చేసిన సేవలు చిరస్మరణీయమని క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గాయం పట్టాభిరెడ్డి, బొల్లు రాంబాబు అన్నారు. శుక్రవారం పబ్లిక్ క్లబ్ ఆవరణలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన క్లబ్ శాశ్వత సభ్యుడు అక్కిరాజు వెంకట్రావు చిత్రపటానికి సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.