రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం APకి ఇవ్వాల్సింది కొండంత కాగా ఇచ్చింది గోరంత మాత్రమే అని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు తప్ప బిక్షం కాదని, విభజన రాష్ట్రానికి సంజీవని లాంటిదని పేర్కొన్నారు.