SKLM: ఆమదాలవలస మండలంలో పలు ప్రాంతాల్లో అతివేగం ప్రమాదకరం అనే హెచ్చరిక బోర్డును ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది శుక్రవారం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వాహనాలు అధిక వేగంతో ప్రయాణించవద్ధన్నారు. మలుపులు ఉన్న రహదారులు, గ్రామాల సమీపంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు.