VSP: వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీవాత్సవ్ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యుడు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ జయంతిని శుక్రవారం నిర్వహించారు. విశాఖలోని సిరిపురం జంక్షన్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరలు పాల్గొన్నారు.