ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల మేరకు.. వాహనదారులు పెట్రోల్, డీజిల్ పోయించుకోవాలంటే కచ్చితంగా ‘పొల్యూషన్ సర్టిఫికెట్’ చూపించాలి. ప్రతి పెట్రోల్ బంకు వద్ద సిబ్బంది లేదా సెక్యూరిటీ వారు PUC సర్టిఫికెట్లను తనిఖీ చేస్తారు. సర్టిఫికెట్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10 వేల వరకు భారీ జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని రవాణా శాఖ హెచ్చరించింది.