తిరుమల పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను సమూలంగా ప్రక్షాళించాలని TTDని హైకోర్టు ఆదేశించింది. దొంగతనాలను అరికట్టేందుకు సంస్కరణలు చేపట్టాలని సూచించింది. కానుకల లెక్కింపులో మానవ ప్రమేయాన్ని తగ్గించి AI, అత్యాధునిక యంత్రాలను ఉపయోగించాలని సూచించింది. పరకామణి కేసు నిందితుడు రవికుమార్ ఆస్తుల అమ్మకాల వివరాలను వారంలోగా అందజేయాలన్నారు.