W.G: ఇటీవల ఆకివీడులో డ్వాక్రా సంఘాల సభ్యుల అకౌంట్ల నుంచి సొమ్ము స్వాహా చేసిన ఇద్దరు యానిమేటర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మెప్మా, యూనియన్ బ్యాంక్ అధికారులు ఎస్సై హనుమంతు నాగరాజుకు ఫిర్యాదు చేశారు. యానిమేటర్ సుధా, హేమలతాలపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ఇప్పటికే డ్వాక్రా సంఘ సభ్యులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.