నందమూరి బాలకృష్ణ వారణాసిలోని కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకున్నారు.’అఖండ 2′ విజయం అందుకున్న నేపథ్యంలో.. చిత్రబృందంతో కలిసి వెళ్లిన ఆయన.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. ‘అఖండ 2’ సినిమాలో తాను సనాతన సైనికుడిగా నటించానని అన్నారు. ఆ పాత్ర తనకు ఎంతో ఆత్మసంతృప్తిని ఇచ్చిందని తెలిపారు.