NZB: బోధన్ మండలం కల్దుర్కి శివారులో ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం కల్దుర్కి మంజీరా నుంచి బోధన్ వైపునకు ఇసుక తీసుకువెళ్తున్న ట్రాక్టర్ బైక్ పై వెళ్తున్న రాములు(60)ను ఢీకొంది. దీంతో రాములు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.