ప్రకాశం: పొన్నలూరు మండలం కె. అగ్రహారంలో అప్పుగా తీసుకున్న డబ్బు అడిగినందుకు ఇద్దరు వ్యక్తులు తనపై కర్రలతో దాడి చేశారని కొత్తపాలెంకి చెందిన బాధితుడు వెంకటరెడ్డి ఆరోపించారు. అగ్రహారం గ్రామానికి చెందిన వంగపాటి ప్రసాద్, అతని సోదరుడు రామాంజనేయులు టీడీపీ (MPTC) తనను మాట్లాడుకోవడానికి పిలిచి విచక్షణా రహితంగా దాడి చేశారని బాధితుడు తెలిపారు.