మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కిన మూవీ ‘లక్కీ భాస్కర్’. గతేడాదిలో రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తాజాగా దర్శకుడు వెంకీ ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా కథ, కథనాలపై దృష్టి పెట్టనున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రాన్ని 2027లో రిలీజ్ చేయాలనే ప్లాన్లో వెంకీ ఉన్నట్లు టాక్.