TG: పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య రుణం కోసం మాజీ మంత్రి హరీష్ రావు తన ఇల్లు మార్ట్ గేజ్ చేశారు. విద్యార్థిని మమత చదువుకు రూ.7.50 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. బ్యాంకర్లు ఏదైనా ఆస్తి తాకట్టు పెడితేనే రుణం ఇస్తామని సూచించారు. ఈ విషయం మమత, తండ్రి రామచంద్రం హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లడంతో.. సిద్ధిపేటలోని తన ఇల్లు తాకట్టు పెట్టి రూ.20 లక్షల విద్యారుణం ఇప్పించారు.