సహజీవనం చేసే జంటలకు అలహాబాద్ హైకోర్టు శుభవార్త చెప్పింది. కుటుంబ సభ్యుల నుంచి ముప్పు ఉంటే వారికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. మేజర్లు తమకు నచ్చిన వారితో జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని, పెళ్లితో పనిలేదని జస్టిస్ వివేక్ కుమార్ స్పష్టం చేశారు. సామాజిక కట్టుబాట్ల కంటే వ్యక్తిగత స్వేచ్ఛే ముఖ్యమని, వారికి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తేల్చిచెప్పారు.