నోయిడాలో మహిళా లాయర్‌ను నిర్బంధించి వేధించిన ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. విధి నిర్వహణలో ఉన్న తనను సెక్టార్ 126 స్టేషన్లో 14 గంటల పాటు లాకప్‌లో ఉంచి, లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్ నాథ్ బెంచ్ స్పందిస్తూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 7కి వాయిదా వేసింది.