VZM: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పేరు మార్పునకు వ్యతిరేకంగా శుక్రవారం విజయనగరంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గాంధీజీ మీద వ్యతిరేకతతోనే బీజేపీ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తోందని జిల్లా కార్యదర్శి టీ. సూర్యనారాయణ ఆరోపించారు. చట్టం ద్వారా కూలీలు పొందే హక్కులు లేకుండా చేసేందుకే చట్టాన్ని పథకంగా మార్చి పేరు కూడా మార్చారన్నారు.