MHBD: తొర్రూరు సీపీఎం పార్టీ నాయకులు బొల్లం అశోక్, ఎండీ. యాకుబ్, కొమ్మనబోయిన యాకయ్య తదితర నాయకులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని GMPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ అన్నారు. అర్హులకు పట్టాలు ఇప్పించాల్సిన ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే సమస్యను కాలయాపన చేస్తూ పేదలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు.