GDWL: జిల్లాలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా జనంబాట సాగాలి అని నడిగడ్డ హక్కుల పోరాట సమితి గద్వాల్ జిల్లా ఛైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 21, 22 తేదీలలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టనున్న జాగృతి జనంబాట వాల్ పోస్టర్ను ఆయన గురువారం ఆవిష్కరించారు.