ఇస్రో చరిత్రలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. 100వ ప్రయోగానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 24న షార్ నుంచి LVM3-M6 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు. దీని ద్వారా అమెరికాకు చెందిన ‘బ్లూ బర్డ్’ శాటిలైట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. వాణిజ్యపరంగా కూడా ఇస్రోకు ఇది అత్యంత కీలక ప్రయోగం కానుంది. శాస్త్రవేత్తలు ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.