VSP: దేశపాత్రునిపాలెంకి చెందిన ఇమాది సత్యవతి (70) కుటుంబ సభ్యులు సరిగా చూసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. విశాఖలో ఆర్కే బీచ్ వద్ద ఆమె గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోర్ట్ కోస్టల్ పోలీసులు, స్విమ్మర్లు సకాలంలో వృద్ధురాలిని రక్షించారు. పోర్ట్ సీఎస్పీఎస్ హోంగార్డ్ కుమార్, స్విమ్మర్ మురళి ఆమెను ఒడ్డుకు చేర్చి కౌన్సిలింగ్ ఇచ్చారు.