మూత్రపిండ రాళ్ల సమస్య ఉన్నవారికి పసుపు వినియోగం మరింత జాగ్రత్త అవసరం. పసుపులో ఆక్సలేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో ఎక్కువగా చేరినప్పుడు కాల్షియంతో కలిసి కాల్షియం ఆక్సలేట్గా మారుతుంది. ఇదే మూత్రపిండ రాళ్లకు ప్రధాన కారణంగా మారుతుంది. ఇప్పటికే కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు, ఆ సమస్య వచ్చే అవకాశం ఉన్నవారు పసుపును పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.