JGL: పెగడపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నూతనంగా గెలుపొందిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను మంత్రి లక్ష్మణ్ కుమార్ ఘనంగా సన్మానించారు. గురువారం ధర్మపురి క్యాంపు సర్పంచులకు శాలువాలు కప్పి సన్మానించి అభినందించారు. గ్రామాలాభివృద్ధికి ప్రతి సర్పంచ్ కృషి చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసేందుకు సర్పంచులు ముందుండాలని తెలిపారు.