TG: జయత్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ కేసులో ఎండీ శ్రీనివాస్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. పరారీలో ఉన్న ఆయన్ని చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు. ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో కాకర్ల శ్రీనివాస్ పలువురి నుంచి రూ.60 కోట్లకు పైగా వసూలు చేశారు. గతంలో HYD CCSలో నమోదైన కేసు ఆధారంగా ED మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.