JN: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగాయి. కానీ ఫలితాలు వెలువడినప్పటి నుంచి పల్లెల్లో పంచాయతీలు మొదలయ్యాయి. గ్రామ సర్పంచ్ స్థానం గెలిచేందుకు, అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను మరిచి విచ్చలవిడిగా డబ్బు, మద్యం, మాంసం, చీరలు, కానుకలు, ఓటర్లకు పంచి ఓట్లు దండుకునేందుకు ప్రయత్నాలు చేశారు. డబ్బుకోసం తమకు ఓటు వేయలేదని ఓటర్లతో గొడవలకు దిగుతున్నారు.